ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (07:01 IST)

అందరికి అందుబాటులో షేడ్ స్టూడియోస్

keeravani and others
keeravani and others
మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం.కీరవాణి గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన షేడ్ స్టూడియోస్ నాలుగు  వసంతాలు పూర్తి చేసుకుంది. సంగీత దర్శకులు మధు పొన్నాస్, సౌండ్ ఇంజినీర్ రామ్  గండికోట, సింగర్స్ అనుదీప్, దీపు, హైమత్, లిప్సిక, పృథ్వి చంద్ర, రేవంత్, రోల్ రీడా, ఎం.ఎం.శ్రీలేఖ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సహకారంతో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 33 లో గల ఈ స్టూడియో చాలా మంది  సింగర్స్ కి, మ్యూజిక్ డైరక్టర్స్ కి చక్కటి సదుపాయంగా మారింది. 
 
ఇక్కడ మేజర్, హరిహర వీర మల్లు, అల వైకుంఠపురంలో (హింది), రౌడీ బాయ్స్ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలకు సాంగ్స్ రికార్డింగ్ జరిగాయి.  2019 వ సంవత్సరంలో షేడ్ స్టూడియోస్ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించి, 200 కు పైగా షార్ట్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్  చేసి మంచి మన్నన పొందారు. 
 
srithar, devi prasad and others
srithar, devi prasad and others
కాగా, 2020 సంవత్సరంలో మొదటి సారిగా సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి, సునీల్ ముఖ్యపాత్రలో "కనబడుటలేదు" అనే చిత్రాన్ని తీసారు. సినిమాకు సంబంధిచిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి గాను తెలుగు సినీ ఇండస్ట్రీని మ్యాచ్ చేసేలా తీర్చిదిద్ది, సెప్టెంబర్ 9 వ తేదీన సీనియర్ అండ్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆర్.పి. పట్నాయక్ గారి చేతులు మీదుగా పున:ప్రారంభం చేయబడినది.
 
రికార్డింగ్ ఫెసిలిటీస్ తో పాటు డబ్బింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ కంపోసింగ్, మిక్సింగ్ మరియు కలర్ డి.ఐ. లాంటి ఎన్నో సదుపాయాలను ప్రారంభించారు. 2022 ఏప్రిల్ 2 వ తేదీన షేడ్ ఎంటర్టెయిన్మెంట్ బానెర్ స్థాపించి, రెండు వెబ్ ఫిలింస్, ఒక వెబ్ సిరీస్ ఓటీటీ స్టాండర్డ్స్ కి తగ్గట్టు నిర్మించారు. 
 
పుష్ప చిత్రంలో కేశవ పాత్ర పోషించిన జగదీష్ ప్రతాప్ బండారి ముఖ్య తారాగణంగా "ఓ కథ", నూతన నటీనటులతో  "టిక్ టాక్ స్టోరీస్", c/o కంచరపాలెం ఫేం రాజు గారు ముఖ్యపాత్రలో "డి.ఎన్.కె" చిత్రాలు అతి త్వరలో ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నాయి.
 
షేడ్ స్టూడియోస్ ఇప్పుడు 5 వ వసంతం లోకి నూతన ఉత్సాహంతో అడుగుపెడుతోంది. 
2018 లో మొదట ఒక రికార్డింగ్ స్టూడియోగా ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు మొత్తం సినిమాకు సంబంధించిన పనులన్నీ ఒకే చోట అయ్యేలా తీర్చి దిద్ది, అటు ప్రొడక్షన్ లోను, ఇటు యూట్యూబ్ చానెల్ తోనూ రాణిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా 
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సేవలను అందించారు. ప్రస్తుతం 25 సినిమాలకు గాను పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సీనియర్ ఎస్.ఎఫ్.ఎక్స్. ఇంజినీర్ వెంకట్ శ్రీకాంత్ గిడుతూరి మరియు సీనియర్ మిక్సింగ్ ఇంజినీర్ శ్రీ మిత్ర స్టూడియోతో అనుసంధానమై ఉన్నారని షేడ్ స్టూడియోస్ CEO  దేవి ప్రసాద్ బలివాడ తెలియజేస్తున్నారు. 
గురువారం జరిగిన కార్యక్రమంలో  “సోనీ లివ్” సౌత్ హెడ్ శ్రీ మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసారు. అయనతో పాటు తన సన్నిహితులు వూళ జాశువా పాల్తో కలసి ఈవెంట్ లో పాల్గొని, షేడ్ స్టూడియోస్ టీం అందరికి బేస్ట్ విశేస్ తెలియజేశారు. సోని లివ్ ఓటిటి తో  కలసి వర్క్ చెసే అంశాల గురించి మాట్లాడుకున్నాం. 
 
అంతే కాకుండా, మరి కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్ట్స్ కుడా ఈవెంట్ కి విచ్చేశారు. అందులొ కొనిదేల నాగబాబు నటించిన “సాక్షి” మూవీ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే VSMC బ్యానర్  ప్రొడ్యూసర్ శ్రీ సత్య గారు, పద్మశ్రీ మూవీ ధర్సక నిర్మాత శ్రీ SS Patnaik గారు, మిషన్ 2020 మూవీ ప్రొడ్యూసర్ రాజు, సంగీత దర్శకులు మధు పొన్నాస్ గారు కూడ ఈవెంట్ లో పాల్గొన్నారు.  అలాగే  కనబడలేదు చిత్ర బృందం హీరోలు సుక్రాంత్, యుగ్రామ్, దీపు లతో కలసి విచ్చేశారు. మళ్లీ రావా ఫేమ్ నానాజీ, DNK ఫేమ్ చానిక్య, బాసంగి సురేశ్, అనుదీప్ Viola,  మీడియా శరీఫ్ మరియు సాయి తేజ ఈవెంట్ కి రావడం చాలా హ్యాపీ గా ఉందాని దేవీప్రసాద్ తెలిపారు.