శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2022 (18:29 IST)

మహిళ గొంతు కోసి దారుణ హత్య, అసాంఘిక కార్యకలాపాలా? వివాహేతర సంబంధమా?

murder
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో రావోజీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమావత్‌పురాలో దారుణ హత్య జరిగింది. 35 ఏళ్ల మహిళ గొంతు కోసి తల నుజ్జునుజ్జు చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 
ప్రాథమిక విచారణలో మృతురాలు ఉమ అలియాస్ రాధ భర్త ఛోటే లాల్ పేరు తెరపైకి వచ్చింది. ఐతే హత్య ఎవరు చేశారో, ఏ కారణంతో హత్య చేశారో స్పష్టంగా తెలియరాలేదు. ఓ మహిళ దారుణంగా హత్యకు గురికావడం రెండు రోజుల్లో ఇది రెండో ఘటన.

 
అంతకుముందు, రెండు రోజుల క్రితం ఏరోడ్రోమ్ ప్రాంతంలోని విద్యా ప్యాలెస్‌లో కూడా ఒక మహిళ హత్య ఘటన తెరపైకి వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలలో భాగంగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.