గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (15:06 IST)

వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం... అరెస్టు

woman victim
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై కానిస్టేబుల్ ఒకరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీర్‌పేటకు చెందిన ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి సైదాబాద్‌లో నివసించేది. మాదన్నపేట ఠాణాలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ వచ్చిన పి.వెంకటేశ్వర్లు వారి ఇంటి సమీపంలోనే ఉండేవాడు. అయితే, బాధిత మహిళ, ఈ కానిస్టేబుల్ సన్నిహితంగా ఉండేవారు. ఆ సమయంలో ఓ రోజున ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తిరస్కరించడంతో అప్పటి నుంచి వేధింపులు మొదలుపెట్టారు. 
 
దీనిపై గత 2021 జనవరిలో సైదాబాద్ పోలీస్ స్టేషనులో కూడా ఫిర్యాదు చేయగా, కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అప్పటి నుంచి తన కోర్కే తీరకపోవడమేకాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న అక్కసుతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 14 తేదీ ఆమె ఇంటికెళ్లి గతంలో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. 
 
ఆమె ససేమిరా అనడంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించి, తనకు సహకరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఇంతలో బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో కామాంధుడు పారిపోయాడు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.