శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (11:15 IST)

పబ్‌లో మద్యం సేవించిన మోడల్.. కారులో అత్యాచారం చేసిన కామాంధులు

rape demo
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌‍లో దారుణం జరిగింది. కారులో మోడల్ అత్యాచారానికి గురైంది. పబ్‌లో పీకల వరకు మద్యం సేవించిన మోడల్‌పై కన్నేసిన కొందరు కామాధులు.. ఆమెను ఇంటి వద్ద దింపుతామని నమ్మించి కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి వయసు 19 యేళ్లు. గురువారం రాత్రంతా నగరమంతా కారులో తిప్పుతూనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఓ మహిళతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
కొచ్చిన్ షిప్‌ యార్డు సమీపంలోని ఓ పబ్‌కు వెళ్లిన బాధిత మోడల్.. అక్కడ మద్యం సేవించింది. దీన్ని గమనించిన కొందరు యువకులు ఓ అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఆమెను కక్కనాడ్‌లో ఉన్న నివాసంలో దింపుతామని నమ్మించారు. ఆ తర్వాత రాత్రంతా పట్టణంలో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లారు.
 
మరుసటిరోజు తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గ్రహించిన ఆ మోడల్.. చికిత్స కోసం కలమసెర్రి వైద్య ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమె ప్రైవేట్ భాగాల్లో గాయాలైనట్టు తేలింది. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు కేసు నమోదు చేసి, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధులతో పాటు వారికి సహకరించిన ఓ మహిళను అరెస్టు చేశారు.