ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (09:27 IST)

సరిసంపదల కోసం ఇద్దరు మహిళల నరబలి.. ముక్కలు చేసిన భార్యాభర్తలు

black magic
కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. నరబలి ఇస్తే సిరిసంపదలు వనగూరుతాయన్న ఆ దంపతులు బలంగా నమ్మారు. ఇందుకోసం ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని పథనంతిట్ట అనే జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ముగ్గురు వ్యక్తులు ఆశపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి.. వారి మృతదేహాలను ముక్కలు చేసి పాతిపెట్టారు. 
 
ఈ దారుణానికి తిరువళ్లకు చెందిన భగవంత్‌ సింగ్‌, అతని భార్య లైలా తెగబడ్డారు. వీరికి మహ్మద్‌ షఫీ అనే మరో వ్యక్తి తన వంతు సహకారం అందించాడు. ఇందులోభాగంగా, షఫీ అనే వ్యక్తి కడవంతర, కాలడీలకు చెందిన ఇద్దరు మహిళలతో మహ్మద్‌ షఫీ సోషల్‌ మీడియాలో స్నేహం చేశాడు. సెప్టెంబరు 26వ తేదీన వారికి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం భగవంత్‌ సింగ్‌ దంపతులతో కలిసి బలి ఇచ్చాడు. 
 
ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగించే పద్మం (52), రోస్లీ(50)గా మృతులను గుర్తించారు. జీవితంలో ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతోపాటు, సిరిసంపదలు కలుగుతాయన్న మూఢ నమ్మకంతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.