శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (13:46 IST)

వివాహం జరిగిన 25 రోజులకే భార్య హత్య.. శవాన్ని సంచిలో కుక్కి...

murder
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీరా జిల్లా క్రిస్టియన్ గంజ్‌‍లోని ద్వారకా అనే ఏరియాలో దారుణం జరిగింది. పెళ్లయిన 25 రోజులకే కట్టుకున్న భర్త చంపేశాడు. అదనపు కట్నం కోసం వేధించి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారు. భార్య గొంతుకోసి సంచిలో చుట్టి అడవిలో పడేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ద్వారకకు చెందిన ముఖేష్ అనే వ్యక్తి జెన్నీఫర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆయన అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేయసాగాడు. తన ఒత్తిడి ఫలించకపోవడంతో భార్యను గొంతుకోసి చంపేసాడు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటగట్టి అడవిలో పడేశాడు. 
 
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఖేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. భార్య మృతదేహాన్ని ముఖేశ్ స్కూటీపై తీసుకెళ్లి అడవిలో పడేసినట్టు చెప్పాడు. నిందితుని సాహయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.