గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated: గురువారం, 17 నవంబరు 2022 (12:25 IST)

మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త.. ఎక్కడ?

knife
ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అనంతపురం పట్టణ కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీలో పని చేస్తున్న మహిళా లెక్చరర్‌పై ఆమె భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో విద్యార్థులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
 
కాలేజీలోని తరగతి గదిలో లెక్చరర్ సుమంగళి కామర్స్ పాఠాలు బోధిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త ఈ దారణానికి పాల్పడటానికి కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.