గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (11:19 IST)

మహేష్ బాబు నన్ను ఏడిపించాడు : అడివి శేష్

adavi-mahesh
adavi-mahesh
సినిమాకు లాజిక్ చూడాలి. గ్రాఫిక్ వాళ్ళ నో లాజిక్. కానీ దాన్ని కూడా చూసి సినిమాలు చేసేవాడు అడివి శేష్ అని హీరో నాని చెప్పాడు. మరి మహేష్ బాబు కూడా అడివి శేష్ గురించి చాలా చెప్పాడు. ఎందుకో తెలుసికోవాలంటే  మహేష్ బాబు ఏమన్నాడో చూద్దాం. రిలీజ్‌కు ముందు రోజు హిట్ 2 సినిమాను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు సపరేట్‌గా షో వేశాం. ఎవ్వరూ ఏమీ చెప్పలేదు అని అడివి శేష్ అన్నారు. 
 
అడివి శేష్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రివ్యూలు వచ్చేస్తున్నాయి. కానీ ట్విస్టులు ఎవ్వరూ రివీల్ చేయలేదు. ఉదయం నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అప్పటికే మహేష్‌ బాబు గారివి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే నేను కాల్ చేశాను. నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్‌ అన్నారు.. నాకు వెంటనే కంట్లో నీళ్లు తిరిగాయి. నీకు ఎప్పుడూ నేను అన్నలా అండగా ఉంటాను అని అన్నారు. నాకు ఆ మూమెంట్‌ ఎంతో స్పెషల్‌గా అనిపించింది. ఇక రివ్యూలు వస్తున్నాయి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. కానీ ట్రాఫిక్ వల్ల ఆలస్యమైంది. నా సినిమాకు నేనే వెళ్లలేకపోయాను. అదే నిజమైన సక్సెస్ అని అర్థమైంది. అమెరికాలో ఉన్నప్పుడు నాని లాంటి సినిమాలు తీయాలని, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడని అనుకున్నాను. ఇప్పుడు ఇలా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీనాక్షి మీద వస్తున్న ప్రశంసలు చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఆమెకు ఇది ఆరంభం మాత్రమే. మళ్లీ ఆమెతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.