1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nani and Adivi Sesh had a champagne party

షాంపైన్‌ పార్టీ చేసుకున్న నాని, అడవి శేష్‌

sailesh, nani, sesh
sailesh, nani, sesh
హిట్‌ 2 సినిమా ఈరోజే విడుదలైంది. మర్డర్‌, మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా విశ్వక్‌ సేన్‌ నటించిన హిట్‌కు సీక్వెల్‌. దీనికి నాని నిర్మాత. శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ నెలకొంది. కొన్నిచోట్ల పాజిటివ్‌ టాక్‌ వుంది. ఐమాక్స్‌ థియేటర్లలో కొందరు చెప్పే రివ్యూలను చూసి ఆనందిస్తూ వివిధ జిల్లాలనుంచి రిపోర్టలను తీసుకుని చిత్ర యూనిట్‌ ఈరోజు సాయంత్రం నాని కార్యాలయంలో పార్టీ చేసుకున్నారు.
 
hit2 team enjoyment
hit2 team enjoyment
ఈ సందర్భంగా నాని, శేష్‌ మాట్లాడుతూ, చంపేశాం, థియేటర్‌లో హిట్‌ 2 బంపర్‌ హిట్‌ అంటూ ఆనందంతో కేకలు వేశారు. కాగా, ఈ సినిమాలో ముగింపులో నాని ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా దర్శనమిస్తాడు. దీనిని కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాలో సూర్య వచ్చినట్లుగా కంపేర్‌ చేసుకుంటూ ఆ సినిమాతో పోల్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాని సోదరి, బావ, చిత్ర దర్శకుడు శైలేష్‌, చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. 
తర్వాతి కథనం
పవన్ రాలేకపోయారు... కారణం అదే.. అలీ వివరణ