గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (07:20 IST)

'హిట్-2' మూవీకి 'జనసేన' గ్లాసుకు ఏంటి సంబంధం?

hit movie poster
యువ నటుడు అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'హిట్-2'. గతంలో వచ్చిన 'హిట్' చిత్రానికి ఇది సీక్వెల్. గురువారం ఈ చిత్రం ట్రైలర్‌‍ను రిలీజ్ చేశారు. పనిలోపనిగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో హీరో అడివి శేష్ ఓ టీ గ్లాసును పట్టుకుని కనిపించారు. అయితే, ఈ గ్లాస్ జనసేన గ్లాసును పోలి ఉండటాన్ని మీడియా గుర్తించి, ఆయన్ను ప్రశ్నించింది. 
 
దీనికి ఆయన సమాధానమిస్తూ, అది జనసేన గ్లాసు కాదు. అస్సలు ఆ పార్టీకి తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్, ఆయన తనయుడు అకీరాకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 
 
కాగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్-2 చిత్రం గతంలో వచ్చిన హిట్ చిత్రానికి సీక్వెల్. వచ్చే నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. విశాఖలో జరిగిన ఓ యువతి హత్య కేసు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.