మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (15:43 IST)

మహేష్ సార్ మేజర్ సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు: హిట్2 అడివి శేష్

hit2 team
hit2 team
క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. 
 
ఈ సందర్బంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ ‘‘హిట్ వన్ తర్వాత హిట్ 2 ప్లాన్ చేసుకున్నాను. శేష్ దగ్గరకు వెళ్దామని అనుకుంటే వెళ్లొద్దు. మనోడు కెలికేస్తాడు. అన్నీ మనోడే రాసేసుకుంటాడు అన్నారు. దాంతో ఫస్ట్ మీటింగ్‌లో నేను భయపడ్డాను. నచ్చుతుందా? నచ్చలేదా అన్నట్లు ఫేస్ పెట్టుకుని కూర్చున్నాడు. తనను చూసి నచ్చలేదని అనుకున్నాను. కానీ.. తనకు బాగా నచ్చింది. తను పర్‌ఫెక్ట్ జెంటిల్ మేన్. సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. కె.డి అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని అనుకున్నానో, దాని కంటే నాలుగైదు రెట్లు బాగానే ప్రెజంట్ చేశాడు తను. అందుకు తనకు థాంక్స్. శేష్ హైట్‌కి తగ్గట్లు హీరోయిన్ ఎవర్నీ తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నప్పుడు మీనాక్షి ప్రొఫైల్‌ను చూశాను. తను చక్కగా ఉంది. నేను హీరోయిన్‌ని ఎలా కావాలనుకున్నానో దాన్ని అలాగే ఆమె పొట్రేట్ చేసింది. తను చాలా బాగా చేశారు. రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని వంటి సీనియర్ ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం దక్కింది. అలాగే యంగ్ టాలెంట్‌తో కూడా కలిసి పని చేశాను. గ్యారీ, మణికందన్ వంటి సూపర్బ్ టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం కలిగింది. నిర్మాత ప్రశాంతిగారికి ధన్యవాదాలు. నేను ఇక్కడ ఉండటానికి కారణం నానిగారే. ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. హిట్ వెర్సెకి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యమేసింది. హిట్ యూనివర్స్‌ని ఇంకా గొప్పగా ఇవ్వాలనే ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది’’ అన్నారు.
 
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘‘టీజర్ నచ్చిందని అందరికీ అర్థమైంది. మూవీ నాకు చాలా స్పెషల్. తెలుగులో నా మూడో చిత్రం. టాలెంటెడ్ టీమ్‌తో కలిసి వర్క్ చేశాను. ఆర్య అనే అమ్మాయి రోల్ ఇచ్చిన శైలేష్‌కి థాంక్స్. నేను ఆ పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నాను. శేష్ వండర్ ఫుల్ ఆర్టిస్ట్. తనతో కలిసి పని చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.
 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ ‘‘చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. నా జర్నీ గురించి ఆలోచిస్తున్నాను. హీరోలందరికీ నచ్చే హీరో నేను. క్షణం సినిమాకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు బన్నీ ఇంత పెద్ద లెటర్ రాసి బ్యూటీఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మహేష్ సార్ నా క్షణం టీజర్ రిలీజ్ చేయటమే కాదు.. నాతో మేజర్ సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు. చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫేవరేట్ హీరో నాని. గూఢచారి, ఎవరు సినిమాల ట్రైలర్స్‌ని తనే లాంఛ్ చేశారు. ఓరోజు సడెన్‌గా వచ్చి ట్రైలర్స్ లాంచ్ చేయటం కాదు..ఓ హిట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని అన్నారు. హిట్ 2 సినిమా అలా లైన్‌కి వచ్చింది. మంచి సినిమా చేయాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో హిట్ 2 సినిమా చేయటానికి టీమ్ ఎంతో కషపడింది. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సినిమా చాలా బావుంటుంది. ఎంజాయ్ చేస్తారు. టీజర్ చూడగానే విలన్ వాయిస్ బాగా నచ్చింది. హిట్ వెర్సెలో డిఫరెంట్ విజన్స్ ఉన్నాయి. అందుకనే హిట్ 2లో నేను యాక్ట్ చేశాను. హిట్ 1 క్వశ్చన్స్‌తో థ్రిల్ చేస్తే.. హిట్ 2 భయపెట్టి థ్రిల్ చేస్తుంది. శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. మంచి నటీనటులతో పని చేశాను. గ్యారీ ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేశారు. తను త్వరలోనే నిఖిల్ స్పైతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. మణికందన్.. ఫెంటాస్టిక్ టెక్నీషియన్. మీనాక్షి చౌదరి టాలెంటెడ్ ఆర్టిస్ట్. నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. హిట్ 2 డిసెంబర్ 2న రానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు.
 
ఎడిటర్ గ్యారీ బి.హెచ్ మాట్లాడుతూ ‘‘అడివి శేష్‌తో ఇది నాలుగో చిత్రం. అలాగే డైరెక్టర్ శైలేష్‌తో ఇది మూడవ చిత్రం. టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. ట్రైలర్ దీనికి మించి బావుంటుంది. సినిమా ఇంకా బావుంటుంది. తప్పకుండా అందరికీ సినిమా నచ్చతుంది. టీమ్‌కి థాంక్యూ’’ అన్నారు.
 
సినిమాటోగ్రాఫర్ మణికందన్.ఎస్ మాట్లాడుతూ ‘‘హిట్ 2’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. మా టీమ్‌లో శేష్ కెప్టెన్ అమెరికా. శైలేష్ కథతో మిమ్మల్ని భయపెడితే మా వర్క్‌తో మేం స్క్రీన్‌పై ఆడియెన్స్‌ని బెదిరిస్తాం. సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
 
శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ ‘‘టీజర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. మూవీ మరో లెవల్‌లో ఉంటుంది. హిట్ వన్ కంటే నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.
 
కోమలి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. వర్ష అనే రోల్ చేశాను. సినిమా అందరికీ నచ్చే ఉంటుంది’’ అన్నారు.
 
నిర్మాత ప్రశాంతి త్రిపిరనేని మాట్లాడుతూ ‘‘హిట్ 2తో రావటం చూస్తుంటే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నేను కూడా స్క్రీన్‌పై సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.