సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (15:33 IST)

నానితో కచ్చితంగా సినిమా తీయాలి, హిట్ ఇవ్వాలి: డైరెక్టర్ శైలేష్‌ కొలను

Director Shailesh Kolanu
Director Shailesh Kolanu
‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు త‌గ్గ‌ట్టే హిట్ సాధించారు శైలేష్ కొల‌ను. ఇప్పుడు ఆయ‌న హిట్ యూనివ‌ర్స్‌ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మ‌రో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. హిట్ కేస్ 1లో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించగా.. హిట్ 2లో అడివి శేష్ హీరోగా న‌టించారు. నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న హిట్ 2 మూవీ డిసెంబ‌ర్ 2న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ఇంట‌ర్వ్యూ.
 
హిట్ ఫస్ట్ పార్ట్‌లోని విశ్వక్ సేన్ రుద్రరాజు కథ కూడా ఉంది. కానీ కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ఫ్రాంచైజీ ప్లాన్ చేశాం. కథను బట్టే కారెక్టర్లను ఎంచుకుంటాను. సెకండ్ కేస్ కథ క్లైమాక్స్ టైం శేష్ అయితే బాగుంటుందని అనుకున్నాను. శేష్‌కి కథ చెప్పిన తరువాత నచ్చింది. ఆయన ఓకే చెప్పాడు. ఓ ఆఫీసర్‌గా పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. ఇందులో కాస్త వెటకారం కూడా జోడించాను. శేష్‌ను కొత్తగా చూపించొచ్చు అని అనుకున్నాను.
 
ముందుగా ఈ ఫ్రాంచైజీని కొత్తలా ప్లాన్ చేశాం. ఒక్కో ఆఫీసర్‌ను పరిచయం చేయడం, ఆయన స్టోరీని చెప్పాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక్కో ఆఫీసర్‌ను పరిచయం చేస్తూ.. చివరకు అందరూ ఆఫీసర్లను కలిపేద్దామని ఫిక్స్ అయ్యాను. అవెంజర్స్‌లా రాసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఇదే విశ్వక్ సేన్‌కు చెప్పాను. ఓకే అన్నాడు. మున్ముందు విశ్వక్ కూడా కనిపిస్తాడు.
 
హిట్ 2లో చాలా ట్విస్టులుంటాయి. ట్రైలర్ ఎంత బాగా కట్ చేస్తే సినిమా మీద అంత బజ్ ఏర్పడుతుంది. ట్రైలర్‌లో ఆ ట్విస్ట్‌లు చెప్పడం వల్ల సినిమాకు ఏమీ ఇబ్బంది ఉండదనిపించింది.
 
హిట్ ఫస్ట్ కేస్ సమయంలో దిశ జరిగింది... సెకండ్ కేస్ సమయంలో మళ్లీ ఇలాంటి (శ్రద్దా వాకర్) ఓ ఘటన జరిగింది. అలాంటి క్రిమినల్స్ సమాజంలో ఉన్నారు. వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలనే ఆలోచన జనాలకు వచ్చినా నాకు సంతోషమే.
 
హిట్ సీజన్ క్రియేట్ చేయమని రాజమౌళి గారు ఇచ్చిన సలహా మాకు కూడా నచ్చింది. కానీ ప్రతీ ఏడాది ఇక హిట్ సినిమానే తీయాల్సి వస్తుంది. 
 
క్రైమ్ స్టోరీలు చేసినా కూడా ఆ సినిమా కోసం నేను చేసే రీసెర్చ్ కొత్తగా ఉంటుంది. పోలీస్ వాళ్లు ఒక్క బుల్లెట్ కాల్చినా కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అందుకే నా సినిమాలో హీరోల చేతిలో గన్స్ ఉన్నా కూడా ఎక్కువగా కాల్చరు. 
 
నాని గారిని కన్విన్స్ చేయడం నాకు పెద్ద కష్టంగా అనిపించదు. సినిమా గురించి మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఇద్దరం సింక్‌లో ఉంటాం. కానీ శేష్‌ను మాత్రం చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కథ చెప్పినప్పుడు ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఐదారు సిట్టింగ్స్ వేశాం. ఆ తరువాతే శేష్ ఓకే చెప్పాడు.
 
క్రిమినల్స్ ఎందుకు ఇలా మారుతారు? అనే చర్చ ఈ సినిమాలో ఉంటుంది. ఇది కరెక్ట్.. ఇది తప్పు అని మాత్రం నేను చెప్పలేదు. ఆడియెన్సే ఆ సీన్‌లోని తప్పేంటి? రైట్ ఏంటి? అన్నది తెలుసుకుంటారు.
 
క్లైమాక్స్‌లో కొత్త శేష్‌ను చూస్తారు. ఎంతో కసిగా చేశారు. కథ పరంగా శేష్ నాకు ఎలాంటి సలహాలు అయితే ఇవ్వలేదు. కానీ ఎందుకు? అనే ప్రశ్న వేసేవారు. దాంతో సమాధానాల కోసం నేను వెతుక్కునేవాడిని.
 
కోడి బుర్ర అనేది నా ఊత పదం. అదే డైలాగ్‌ను ఇందులో పెట్టాం. అది హీరో కావాలని అన్నాడా? ఎందుకు అన్నాడు? అనే విషయం సినిమా చూస్తే తెలుస్తుంది. లవ్ స్టోరీ కూడా కావాలని పెట్టింది కాదు. ఓ కేసును పోలీస్ ఆఫీసర్ టేకప్ చేస్తే ఆయన పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయ్? అనేది కూడా చూపించాం. థ్రిల్లర్ జానర్ అయినా కూడా ఫ్యామిలీ అంతా కనెక్ట్ అయ్యేలా కథను రెడీ చేశాను.
 
ఫస్ట్ పార్ట్‌ను ఆరు నెలలో చేశాను. సెకండ్ పార్ట్‌కు ఏడాది పట్టింది. కరోనా వల్ల మరింత ఆలస్యమైంది. ఇకపై నేను రీమేక్స్ తీయను. హిట్ ఫస్ట్ కేస్‌ను హిందీలో తీసినప్పుడు సోషల్ మీడియాలో అందరూ తిట్టేవారు. ఇప్పుడు ఓటీటీలో సినిమాలను అందరూ చూస్తున్నారు.
 
ముందుగా నేను నాని గారికే కథ చెప్పాను. ఆయనతోనే సినిమా తీయాలని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం నిర్మిస్తాను అని అన్నారు. కానీ ఆయనతో ఒక సినిమా చేయాలి. కచ్చితంగా ఆయనకు హిట్ ఇవ్వాలి.  మూడో పార్ట్ కోసం పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే చెబుతాం.
 
హిట్ సెకండ్ కేస్‌ను హిందీలోనూ డబ్ చేస్తున్నారు. ఇక్కడ రిలీజ్ అయిన రెండు మూడు వారాల తరువాత అక్కడ డబ్ చేస్తాం.
 
మీర్జాపూర్ చూసినప్పుడు జాన్ స్టీవర్ట్ ఏడూరి ఆర్ఆర్ నాకు చాలా నచ్చింది. ఆయన ఇచ్చిన ఆర్ఆర్ వింటూనే ఈ కథను కూడా రాశాను. అందుకే ఆయన్నే ఈ సినిమాకు అడిగాం. ఆర్ఆర్ ఎంతో అద్భుతంగా ఇచ్చారు. హిట్ ఫస్ట్ కేస్ హిందీ వర్షెన్‌కు కూడా ఆయనే ఆర్ఆర్ ఇచ్చారు.
 
వేరే కథలు కూడా రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్స్‌ కథలున్నాయి. బౌండ్ స్క్రిప్ట్‌లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 2 తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెబుతాను.
 
నా డైరెక్షన్ టీంలో చాలా మంది ఉన్నారు. చిన్న వాళ్లున్నారు..పెద్దవాళ్లున్నారు.. సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్లే నా టీంలో ఉన్నారు. నా టీం అంటే నాకు ఫ్యామిలీ. వాళ్లందరికీ డైరెక్షన్ చాన్స్ రావాలి.. నా దగ్గరి నుంచి వెళ్లిపోవాలని అని కోరుకుంటాను.