సంబంధిత వార్తలు
నేను మ్యాజిక్‌ని నమ్ముతాను : నాని
Nani and team
నాని మాట్లాడుతూ.. 'సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.. నెగిటివ్ పాత్రలో సుహాస్ అద్భుతంగా నటించాడు. యాక్టింగ్ అంటే కటౌట్ అవసరం లేదు. నాకు తెలిసిన నటీనటుల్లో సుహాస్ గొప్ప నటుడు. సురేష్ బొబ్బిలి గారి పాట బాగుంది. శ్రీలేఖ గారు ఇచ్చిన ఉరికే ఉరికే పాట నాకు ఎంతో ఇష్టం. మా సినిమా కోసం చాయ్ బిస్కెట్ టీం చాలా కష్టపడింది. కష్టపడి ప్రిపేర్ అయ్యే బ్యాచ్‌లో శేష్ ఉంటాడు.. నేను కాపీ కొట్టి పాస్ అయ్యే బాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. కానీ శేష్ మాత్రం లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా కంటిన్యూగా సక్సెస్‌లు కొడుతున్నాడు. వీరంతా చేసిన పనికి నాకు కూడా కంగ్రాట్స్ వస్తున్నాయి. వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త చిత్రాలు చేయాలని అనుకున్నాను. కానీ ఆడియెన్స్ అంగీకరిస్తారా? అని అందరూ అన్నారు. కానీ మంచి చిత్రాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మరోసారి నిరూపించారు. మా సినిమాకు సహకరించిన మీడియాకు థాంక్స్. అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్.. మళ్లీ కలుద్దాం.. గట్టిగా కలుద్దాం' అని అన్నారు.
తర్వాతి కథనం
