శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (20:42 IST)

విడుద‌ల‌కు సిద్ధ‌మైన విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌

Veera Gunnamma
Veera Gunnamma
భార‌త స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1940 ఏప్రిల్ 1న జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ ఆధారంగా విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌ చిత్రం రూపొందింది.  క‌ళింగ ఆర్ట్ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గూన అప్పారావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం `విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌`. ఆదిత్య భ‌ర‌ద్వాజ్, మ‌హీరా హీరో హీరోయిన్లుగా  న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క  నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ,  శ్రీకాకుళం జిల్లాలోని మంద‌స ప్రాంతంలో  జరిగిన జ‌మీందారి వ్వ‌తిరేఖ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం.  ఈ పోరాటాన్ని సంఘ‌ట‌న స్థ‌లంలోనే భారీగా చిత్రీక‌రించాం.  అప్పుడు జ‌రిగిన పోరాటంలో  ఐదుగురు రైతుల‌తో పాటు , ఇద్ద‌రు పోలీసులు మృతి చెందుతారు.  మ‌రో 15 రోజుల వ్య‌వ‌ధిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ 25 మంది రైతులు,  ఏడుగురు పోలీసులు మృతి చెందుతారు. 42 మంది రైతుల‌కు బ్రిటిష్ ప్ర‌భుత్వం మ‌ర‌ణ శిక్ష విధిస్తుంది.  ఈ నేప‌థ్యాన్ని    ఎంతో స‌హ‌జంగా, అప్పటి నేటివిటీ మిస్ కాకుండా  చిత్రీక‌రించాం.  ఇటీవ‌ల  మా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌,  టీజ‌ర్ ల‌ను శ్రీకాకుళం ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌యివేట్ హోట‌ల్ లో ప్ర‌ముఖ వైద్య నిపుణుడు డా. డానేటి శ్రీధ‌ర్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో పాట‌లు రిలీజ్ చేసి సినిమాను  డిసెంబ‌ర్ మూడో వారంలో  గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.