శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (19:38 IST)

లక్కీ లక్ష్మణ్ కు అలాంటి వాళ్లు నాకు అండ‌గా ఉన్నారు : హీరో సోహైల్

Lucky Laxman teram
Lucky Laxman teram
బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత  గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా శ‌నివారం చిత్ర యూనిట్ టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సోహైల్‌, నిర్మాత హ‌రిత గోగినేని, ద‌ర్శ‌క‌డు అభి, బిగ్ బాస్ ఫేమ్స్‌.. మెహ‌బూబ్‌, అఖిల్ సార్థ‌క్‌, స‌న్నీ త‌దిత‌రులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. 
 
ఈ సంద‌ర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘‘మనందరికీ సోహైల్ సుపరిచితుడే. తను హీరోగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని మనం ఎంక‌రేజ్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. న‌టుడిగా త‌ను రాణిస్తాడ‌ని భావిస్తున్నాను. కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమాల‌ను ఎంక‌రేజ్ చేసినప్పుడే ఎక్కువ వైవిధ్య‌మైన సినిమాలు వ‌స్తాయి. దర్శకుడు అభిగారిని, నిర్మాత హరితగారికి అభినందనలు’’  అన్నారు. 
 
దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ముందు నేను టెక్నీషియ‌న్‌ని. త‌ర్వాతే న‌టుడిని. నిర్మాత హ‌రిత‌గారు చాలా హ్యాపీగా ఉంటారు. డైరెక్ట‌ర్ అభిగారు కూల్ ప‌ర్స‌న్‌. క్లారిటీతో సినిమాను పూర్తి చేశారు. మంచి క‌థ‌, ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంది. త‌న నెక్ట్స్ సినిమా క‌థ కూడా తెలుసు. చాలా బావుంది. అభి మంచి డైరెక్ట‌ర్ అవుతారు. నిర్మాతగా హ‌రిత‌గారు మంచి లాభాల‌ను సాధించాలి. బిగ్ బాస్‌ను నేను పెద్ద‌గా చూడ‌ను. మా భార్య బిగ్ బాస్‌ను చ‌క్క‌గా ఫాలో అవుతుంది. సోహైల్ హీరో అని చెప్ప‌గానే ఆమె చాలా ఎగ్జ‌యిట్ అయ్యింది. తొలి రోజున త‌న‌తో క‌లిసి ఎమోష‌న‌ల్ సీన్‌లో న‌టించాను. సోహైల్ అద్భుతంగా న‌టించాడు. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద యాక్ట‌ర్ అవుతాడ‌ని చెప్పాను. అన్నీ ఎలిమెంట్స్ చ‌క్క‌గా కుదిరాయి’’ అన్నారు. 
 
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌ మాట్లాడుతూ ‘‘లక్కీ ల‌క్ష్మ‌ణ్ టీజ‌ర్ చాలా బావుంది. సోహైల్‌కి ఈ సినిమాతో పెద్ద హిట్ రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తాడు. క‌ష్ట‌ప‌డే వ్య‌క్తికి త‌ప్ప‌కుండా స‌క్సెస్ వ‌స్తుంది. ఈ సినిమాతో అది నిజ‌మవుతుంది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు. 
 
నిర్మాత హ‌రిత గోగినేని మాట్లాడుతూ ‘‘సినిమా అనేది చిన్న బిడ్డతో సమానం. సినిమా కోసం ఏం చేయాలో అవన్నీ చేసేశాం. ఇక ఆడియెన్స్‌దే బాధ్య‌త‌. క‌ష్ట‌ప‌డి ప్యాష‌న్‌తో పైకి వ‌చ్చాడు. అభికి కూడా ఫ‌స్ట్ సినిమా. మా అంద‌రినీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను. క‌లెక్ష‌న్స్ కంటే సినిమా బావుంద‌ని అంటే చాలు. అంద‌రూ థియేట‌ర్స్‌లోనే సినిమా చూడాలి. 
 
హీరో సోహైల్ మాట్లాడుతూ ‘‘ఈరోజు నేను హీరోగా చేసిన ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాట‌లు రావ‌టం లేదు. అభిమానులే నాకు ధైర్యం. ఇండ‌స్ట్రీలో మ‌నం పిలిస్తే వ‌స్తారు..రారు.. వ‌చ్చినా మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడ‌రు. కానీ మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డే ఫ్యాన్స్‌మ‌నల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఎక్క‌డెక్క‌డి నుంచో ఫ్యాన్స్ వ‌చ్చారు. ఆ విష‌యం తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. స‌క్సెస్ ఉన్నా, లేక‌పోయినా మ‌నల్ని ఆద‌రించేది మ‌నం ఇష్ట‌ప‌డేవాళ్లు, ఫ్యాన్స్‌, ఫ్రెండ్స్‌. అలాంటి వాళ్లు నాకు అండ‌గా ఉన్నారు. సినిమాకు మా వ‌ల్ల ఎంత వీల‌వుతుందో దాన్ని చేశాం. బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత తొలి సినిమాగా ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ రిలీజ్ వ‌స్తుంది. లైఫ్‌లో 12-13 ఏళ్లు చాలా క‌ష్ట‌ప‌డ్డాను. బెక్కం వేణుగోపాల్‌గారు నాకు స‌పోర్ట్ చేసి అవ‌కాశం ఇచ్చారు. మా నిర్మాత హ‌రిత గోగినేని గ‌ట్స్ ఉన్న ప్రొడ్యూస‌ర్‌. అభిగారు అన్నీ ఎలిమెంట్స్‌ను చ‌క్క‌గా మిక్స్ చేసి ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడిగారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌గారికి థాంక్స్‌. చాలా చిన్న స్టేజ్ నుంచి ఈ స్థాయికి వ‌చ్చాం. మాకు తెలిసింది న‌ట‌న మాత్ర‌మే. డిసెంబ‌ర్ 30న సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఇంకా క‌ష్ట‌ప‌డ‌తాను’’ అన్నారు. 
 
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘మా కంటే ఆల‌స్యంగా సినిమాను స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ మా అంద‌రి కంటే ముందే హ‌రిత‌గారు సినిమాను రిలీజ్‌కి సిద్దం చేశారు. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమాను చాలా నీట్‌గా తెర‌కెక్కించారు. మంచి టెక్నిక‌ల్ టీమ్ ప‌ని చేసింది. ఈ నెల 30న ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ రిలీజ్ అవుతుంది. టీజ‌ర్ చాలా బావుంది. సోహైల్ చాలా ఆశ‌తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. త‌ను భ‌య‌ప‌డుతూనే నాలుగు సినిమాల‌ను పూర్తి చేసేశాడు. సోహైల్ నాకు బిగ్ బాస్ కంటే ముందు నుంచే నాకు తెలుసు. త‌ను చిన్న పాత్ర‌ల‌ను చేస్తూ ఎదిగాడు. త‌న పెయిన్ నాకు తెలుసు. హీరోగానూ స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంది. ముందు రిలీజ్ అవుతున్న ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ అభికి అభినంద‌న‌లు. మంచి డైరెక్ట‌ర్‌గా ఎదుగుతాడు’’ అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.అభి మాట్లాడుతూ ‘‘సినిమా మేకింగ్ సమయంలో మంచి ప్రొడక్ట్ కోసం అందరం గొడవలు పడ్డాం. ఫైనల్‌గా సినిమాను సిద్ధం చేశాం. సినిమా టీజ‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంది. ట్రైల‌ర్‌, రెండు పాట‌లు రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఓ స్మైల్‌తో బ‌య‌ట‌కు వ‌స్తారు. అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. మా నిర్మాత హ‌రిత గోగినేనిగారికి థాంక్స్‌. సోహైల్ సూప‌ర్బ్‌గా యాక్ట్ చేశాడు. త‌ను నెక్ట్స్ లెవ‌ల్ యాక్ట‌ర్‌. ఆర్ఆర్ లేకుండా చూస్తేనే సినిమా మాకు న‌చ్చేసింది. ఇక ఆర్ఆర్‌తో నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. అనూప్‌గారికి, ప్ర‌వీణ్‌పూడిగారికి, అండ్రూ గారికి థాంక్స్‌’’ అన్నారు.