ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (18:04 IST)

హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకునే వరుడు ఎవరో తెలుసా? (video)

hansika
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
హీరోయిన్ హన్సిక మొత్వాన్ని ఓ ఇంటికి కోడలు కానుంది. ఆమె వివాహం వచ్చే నెల నాలుగో తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. అయితే, ఆమెను పెళ్ళి చేసుకోనున్న వరుడు ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. 
 
గత కొంతకాలంగా తాను డేటింగ్‌లో ఉన్న సోహాల్ కతూరియాను ఆమె వివాహం చేసుకోనుంది. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరి వివాహం డిసెంబరు నాలుగో తేదీన జరుగనుంది. ఈ పెళ్లికి రెండు రోజుల ముందు నుంచి సంగీత్, మెహందీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 
 
జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్‌లో వీరి వివాహం జరుగనుంది. సోహాల్ కంపెనీలో హన్సికకు కూడా షేర్లు ఉన్నట్టు సమచారం. మరోవైపు, తమ పెళ్ళికి వచ్చే అతిథుల కోసం ఇప్పటికే లగ్జరీ హోటళ్ళలో గదులు బుక్ చేసినట్టు సమాచారం. మొత్తంమీద హన్సిక పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగేందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.