సంబంధిత వార్తలు
- వర్ష బొల్లమ్మకు పెళ్లి.. నాకు తెలియకుండా పెళ్లి చూపులు చూసి, అబ్బాయిని?
- పవన్ మూడు పెళ్ళిళ్లపై ఆర్జీవీ సినిమా? సీఎం జగన్ ఆదేశం మేరకేనా?
- ఆదిలాబాద్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. హైదరాబాదులో డుం.. డుం.. డుం..
- నీ వెర్షన్ కాదు..నా వెర్షన్ కాదు.. నిజం అనేది ఒకటి ఉంటుంది..
- ప్రియుడు అసిఫ్ అలీని పెళ్లాడిన నటి పూర్ణ
24 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో వున్నాను.. త్వరలో పెళ్లి: పృథ్వీరాజ్
Prithivee
కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆ వార్తలపై స్పందించారు పృథ్వీ.
అయితే ఆ అమ్మాయికి 23 ఏళ్లు కాదని.. 24 అని.. అలాగే.. ఇంకా తమకు పెళ్లి కాలేదని.. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. ఆ అమ్మాయి మలేషియాకు చెందిన యువతి కాదని.. తెలుగమ్మాయి అని స్పష్టం చేశారు.
పృథ్వీరాజ్ 1994లో బీనాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న పృథ్వీ తెలుగమ్మాయి అయిన శీతల్‌తో ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా వుందని.. ముందు తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు.
చాలా సమయం ఇచ్చానని.. ఆలోచించుకోమన్నానని పృథ్వీ తెలిపాడు. అందుకు ఆమె కుటుంబం కూడా పెళ్లికి ఒప్పుకుంది. అయితే త్వరలోనే శీతల్‌ను వివాహం చేసుకుంటానని.. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నామని.. తనపై నమ్మకం ఉందని అన్నారు.
తర్వాతి కథనం
