శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (14:19 IST)

నీ వెర్షన్ కాదు..నా వెర్షన్ కాదు.. నిజం అనేది ఒకటి ఉంటుంది..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుతం నానా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు పెళ్లిళ్లు.. ప్యాకేజీ స్టార్ అంటూ రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడిన మాటలకు.. తనదైన రీతిలో సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్. అంతేకాదు చెప్పు చూపించి తనను ప్యాకేజీ స్టార్ అంటే వైసిపి నేతల చెంపలు పగలగొడతానని స్పష్టం చేశారు. విడాకులకు తర్వాత భరణం ఇచ్చినట్లు పవన్ కామెంట్స్ చేశారు. 
 
అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయినప్పుడు రేణు దేశాయ్ ఒక్క రూపాయి కూడా భరణంగా తీసుకోలేదని ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వీడియోని కూడా ఇప్పుడు చాలామంది వైరల్ చేస్తున్నారు.  తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ ఆంతర్యం ఏమిటో తెలియక నెటిజెన్లు సైతం తెగ తలపట్టుకుంటున్నారు. 
 
తాజాగా తాను చేసిన పోస్టులో.. "నీ వెర్షన్ కాదు..నా వెర్షన్ కాదు.. నిజం అనేది ఒకటి ఉంటుంది. నిజం శాశ్వతంగా ఉంటుందనేది నేను నా జీవితంలో నేర్చుకున్న అంశం".. అంటూ ఒక కొటేషన్‌ను రీల్ రూపంలో పెట్టింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)