1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (15:35 IST)

భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చా.. మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చా?

vasireddy padma
మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తక్షణమే వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఇంకా ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మహిళా లోకానికి పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇచ్చేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలున్నాయని పద్మ ఫైర్ అయ్యారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేకమేనని చెప్పారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చని అనుకోరా? అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. 
 
పవన్ వ్యాఖ్యలతో మహిళా లోకం షాక్‌కు గురైందన్నారు. అందుకే పవన్ కల్యాణ్ మాటల్లోని తప్పును తెలుసుకుని సంజాయిషీ ఇస్తారని ఆశించామన్నారు. అయితే మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు క్షమాపణలు కూడా చెప్పలేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు.