శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (14:42 IST)

ఆదిలాబాద్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. హైదరాబాదులో డుం.. డుం.. డుం..

Marriage
Marriage
ఆదిలాబాద్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లిగా మారింది. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా వీరి వివాహ వేడుకకు హైదరాబాద్ వేదికగా మారింది.  
 
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌కు చెందిన దేవిదాస్, కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్ రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇద్దరు కుటుంబీకుల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆపై హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇరు కుటుంబాల సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఆదిలాబాద్ అబ్బాయితో అమెరికా అమ్మాయికి ఘనంగా పెళ్ళి జరిపించారు.  
 
వధువు తల్లిదండ్రులు, బంధువులు హిందూ సంప్రదాయాలను అమితంగా ఇష్టపడుతున్నారు. పెళ్ళికొడుకు తండ్రి దేవిదాస్ పోలీసు శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్నారు. కాగా వధువరులిరిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.