మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (22:31 IST)

పెళ్లి పీటలెక్కనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్... వరుడు ఎవరంటే? (video)

Nikisha patel
Nikisha patel
బాలీవుడ్ నటి నిఖీషా పట్లే పెళ్లి పీటలెక్కనున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కొమరం పులి" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నిఖీషా... తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2010లో వచ్చిన ఈ చిత్రంలో తన నటనతో నిఖీషా పటేల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 
 
అయితే, ఈ చిత్రం తర్వాత ఆమెకు ఆశించిన మేరకు సినిమా అవకాశాలు రాలేదు. దీంతో తమిళం, కన్నడ, మలయాళ చిత్రసీమల్లోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆమె ఉన్నట్టుండి సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం ఫ్యాన్స్‌‍తో టచ్‌లోనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో ఆమె దీపావళి పండుగను పురస్కరించుకుని ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను ఒక విదేశీయుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. పనిలోపనిగా తాను పెళ్లిచేసుకోబోయే వరుడి ఫోటోను కూడా ఆమె బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు.