ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (16:10 IST)

ఇన్‌స్టాలో యాక్టివ్ అయిన సమంత.. యశోద అప్డేట్ ఇచ్చిందిగా

Samantha
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇన్ స్టాలో యాక్టివ్ అయ్యింది. తాజాగా తాను నటిస్తున్న యశోద అఫ్డేట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 
 
అందులో యశోద ఒకటి. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక ప్రసాద్ నిర్మిస్తున్నారు.
 
యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈమూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
 
తాజాగా దీపావళి పండగ పురస్కరించుకుని ఈ నుంచి కొత్త పోస్టర్ వదిలారు. అలాగే.. ఈ మూవీ ట్రైలర్ అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళంలో నవంబర్ 11న విడుదల చేయనున్నారు.