శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (11:01 IST)

ఓటీటీలో హన్సిక పెళ్లి స్ట్రీమింగ్...

Hansika
టాలీవుడ్ టాప్ హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పోటీలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడిని పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. 
 
వీరి వివాహం వచ్చే నెల 4వ తేదీన జైపూర్‌లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో జరగబోతోంది. వీరి వివాహం నెట్ ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. 
 
పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం ఇప్పటికే భారీ డీల్ కుదరనుంది. 
 
హన్సిక వివాహం సన్నిహితులు మధ్య జరగునుంది. ఈ వివాహానికి పరిమిత అతిథులు హాజరుకానున్నారు, ఇందులో కొంతమంది సన్నిహితులు, జంట కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
డిసెంబరు 3వ తేదీని మెహందీ, సంగీత వేడుకల కోసం ఎంచుకున్నారని, డిసెంబర్ 2వ తేదీన సూఫీ రాత్రి జరుగనుంది. డిసెంబర్ 4వ తేదీ సందర్భంగా క్యాసినో నేపథ్యంతో కూడిన పార్టీని కూడా నిర్వహిస్తారు.