1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 17 అక్టోబరు 2022 (19:01 IST)

పెళ్లికి సిద్ధమైన హన్సిక.. జైపూర్ కోట వేదికగా... వరుడు ఎవరో?

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలెట్టిన హన్సిక.. ఆపై హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. 2007లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన "దేశముదురు" సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైనా హన్సిక, మొదటి సినిమాతోనే తెలుగులో బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది.
 
తెలుగు, తమిళ, హిందీ భాషలతో కలిపి మొత్తం 50కి పైగా సినిమాలో నటించిన హన్సిక.. ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకోవడంలో వెనకబడింది. దీంతో ఈ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. రాజస్థాన్‌లోని జైపూర్ కోట వేదికగా ఈ వేడుక జరుగనుంది. 
 
డిసెంబర్‌లో జరగబోయే పెళ్లిసందడి కోసం ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అయితే ఈ అందాల భామని పెళ్లాడేది ఎవరన్నా విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.