మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-10-2022 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మీని ఎర్రని పూలతో ఆరాధించినా...

mahalakshmi
మేషం :- ఉద్యోగస్తులకు, అధికారులకు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయటం మంచిది. బ్యాంకు వ్యవహారాలలు అనుకూలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. పెద్దలు, ప్రముఖుల సహాయ సహకారాలు లభిస్తాయి.
 
వృషభం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త స్కీంలు, షాపుల అలంకరణలు చేపడతారు. ఉద్యోగస్తుల ఓర్పు, పనితనానికి ఇది పరీక్షా సమయం.
 
మిథునం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పని భారం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. దైవ సేవా కార్యక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. వస్త్ర వ్యాపారాలులాభసాటిగా ఉంటాయి. విద్యార్థినులు, విద్యార్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
సింహం :- ప్రైవేటు, పత్రికా రంగంలోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాలు వెళ్ళటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం ఉంటుంది.
 
కన్య :- వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ సంతానంపై చదువులపట్ల దృష్టి సారిస్తారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. ఉద్యోగస్తుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు వ్యవహరాలు ఒక పట్టాన తేలకపోవటంతో అసహనం తప్పదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
తుల :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ చిన్నారులకు ధనంఅధికంగా వెచ్చిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
వృశ్చికం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. బంధు మిత్రుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
ధనస్సు :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ పని వారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
 
మకరం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. రాజకీయనాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపార వర్గాల వారికి చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం.
 
కుంభం :- గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్త వహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా మీ తాహతుకు మించి ఖర్చు చేయకండి.
 
మీనం :- ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. చిన్నారుల విషయంలో పెద్దలగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు.