సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-10-2022 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే సర్వదా శుభం...

anjaneya swamy
మేషం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికం. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. 
 
వృషభం :- వృత్తి, ఉద్యోగాల్లో తలెత్తిన ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం, చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి.
 
మిథునం :-మీపై సెంటిమెంట్లు, గత అనుభవాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ సమర్థతపై నమ్మకం సడలుతుంది. లౌక్యంగా వ్యవహరించటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికమవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెలిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
సింహం :- బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో భేషజం, మొహమ్మాటాలు కూడదు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికంగా ఉంటాయి.
 
కన్య :- స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెట్టిపోతల విషయంలో పెద్దల సలహా పాటించటం శ్రేయస్కరం. నేడు చేజారిన అవకాశం తిరిగి రావటం కష్టమని గ్రహించండి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు.
 
తుల :- ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచనస్ఫురిస్తుంది.
 
వృశ్చికం :- విదేశాలు వెళ్ళడానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు ఎప్పటినుంచో ఆగి వున్న పనులు పున:ప్రారంభమవుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది.
 
మకరం :- ఫ్యాన్నీ, వస్త్ర, కిరాణా, కిళ్లిరంగాలలో వారికి కలిసిరాగదు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ప్లీడర్లు, ప్లీడర్లకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతుంది. స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పని కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు.
 
కుంభం :- సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి.
 
మీనం :- బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశనెరవేరదు.