గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-10-2022 గురువారం దినఫలాలు - సాయిబాబాగుడిలో అన్నదానం చేసిన శుభం..

Karkatam
మేషం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. బంధువుల రాకతో ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. రాజకీయ నాయకులు కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు.
 
మిథునం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. ప్రముఖులతో కీలకమైన వ్యవహరాలు చర్చలు జరుపుతారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆకస్మికంగా పొట్ట, తలకి సంబంధించిన చీకారులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెలకువ అవసరం.
 
సింహం :- బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదంలభించదు.
 
తుల :- వ్యాపార రీత్యా దూర ప్రయాణాలుచేయవలసి వస్తుంది. ప్రముఖుల కలయిక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. క్రయ విక్రయాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో ఏకాగ్రత మెళుకువ చాలా అవసరం. ఉద్యోగస్తులపై అధికారులను ఉంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. ఉద్యోగస్తులకు అడ్వాన్లు, బోనస్, సెలవులు మంజూరవుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు చేజారిపోతాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మకరం :- దంపతుల మధ్య కలహాలు, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. కోర్టు వ్యవహారాల్లో పీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులను ఎదుర్కొంటారు. మిత్రులను కలుసుకుంటారు.
 
కుంభం :- రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందు లెదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. సంగీత, నృత్య కళాకారులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. కోర్టులో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.