గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-10-2022 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం..

simha raasi
మేషం :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై శ్రద్ద వహించండి. ప్లీడర్లకు సామాన్యం. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరిగిన ఆచి, తూచీ వ్యవహరించడం మంచిది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. స్త్రీల వాక్‌తుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వాహనం నిర్లక్ష్యంగా నడపటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
మిథునం :- వ్యాపారాలలో ఉత్సాహం, సంతృప్తి కానవస్తుంది. వార్తా సంస్థలలోని వారికి మందకొడిగా ఉంటుంది. సమయానికి మిత్రులు సహకరించకపోవటంతో అసహనానికి గురవుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో సతమతమవుతుంటారు. మీ సంతానం మొండితనం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, ఒత్తిడి తప్పవు. కానివేళలో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ, వివాహయత్నాలు కలిసి రాగలవు. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
సింహం :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. చేపట్టిన పనుల్లో ఓర్పు, లౌక్యం అవసరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి.
 
కన్య :- ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వాయిదాలు, చెల్లింపులు సకాలంలో జరుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పూర్వ మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
 
తుల :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, తోటివారితో ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలలో మెళుకువ అవసరం.మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహరాలు చురుకుగా సాగుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. దైవ కార్యాలల్లో పాల్గొంటారు. నిరుద్యోగులయత్నాలు కలిసివస్తాయి.
 
ధనస్సు :- వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాలు నిరుత్సాహం కలిగిస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల సమస్యలు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు.
 
మకరం :- ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో నూతన పెట్టుబడులు, కాంట్రాక్టు వ్యవహరాలు చర్చలు జరుపుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. అకారణంగా ఇతరులతో మాటపడవలసివస్తుంది.
 
కుంభం :- సేవ, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రుణయత్నాల్లో ఆటంకాలు తప్పవు. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం :- కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు.