మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-10-2022 గురువారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం..

Maha Shivaratri
మేషం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. తరచు సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలుకాగలవు.
 
వృషభం :- వ్యాపారాల విస్తరణకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. ఆకస్మికంగా పొట్ట, తలకి సంబంధించిన చికాకులను అధికంగా ఎదుర్కొంటారు. రావలసిన ధనం అందకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు ఏ పని యందు ధ్యాస ఉండదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది.
 
మిథునం :- ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడంవల్ల విభేదాలు తలెత్తవచ్చు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
కర్కాటకం :- భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణ నిలదొక్కుకుంటారు. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయలేర్పడతాయి. మీ యత్నాల్లో ఆలస్యంగానైనా మంచి ఫలితాలు లభిస్తాయి.
 
సింహం :- రిప్రజెంటిన్లు, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి పెరగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులపై అధికారుల మన్ననలను పొందగలుగుతారు. వృత్తుల్లో వారికి, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి.
 
కన్య :- శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు సంతృప్తి కానవస్తుంది.
 
తుల :- విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. నిరుద్యోగులకుబోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
 
వృశ్చికం :- బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవ, పుణ్యకార్యాలకు విరివిగా ధనంవ్యయం చేస్తారు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు :- వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ అనవసరం. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
మకరం :- రాజకీయనాయకులకు ఒప్పందాలు, హామీల విషయంలో పునరాలోచన మంచిది. ప్రైవేటు సంస్థల్లో వారు, ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకుఎంతో చికాకులను కలిగిస్తుంది. ఏ విషయంలోను తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
 
కుంభం :- ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రవాణా కార్యక్రమాలలో చురుకుదనం కానవస్తుంది. వాతావరణంలోని మార్పు మీకుఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. బంధువులను కలుసుకుంటారు.