గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-10-2022 బుధవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా శుభం...

lakshmidevi
మేషం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఆకస్మికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలు, ప్రాజెక్టుల దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ సంతానం ఉన్నత విద్య గురించి ఒక నిర్ణయానికి వస్తారు.
 
వృషభం :- దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి.
 
మిథునం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ చాలా అవసరం. ఉన్నతాధికారుల హోదా పెరగటంతో పాటు స్థానమార్పు ఉంటుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో మెలకువ వహించండి.
 
కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ప్రతి పనిలోను ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తప్పవు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
సింహం :- రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కన్య :- మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థలలో పనులు వాయిదా పడతాయి. వారసత్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. విద్యార్థులకు ఏకాగ్రత, అసక్తి ఏర్పడుతుంది. 
 
తుల :- విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు.
 
వృశ్చికం : బంధువుల ఆకస్మిక రాక వల్ల స్త్రీలకు పని భారం అధికమవుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో కలిగిస్తుంది. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
ధనస్సు :- వాహన చోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళనకలిగిస్తుంది. 
 
మకరం:- ఎవరికైన ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. జాగ్రత్త వహించండి. స్త్రీలకు బంధువులతో పట్టింపు లొస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. ఆపత్సమయంలో మిత్రులు ఆదుకుంటారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు.
 
కుంభం :- స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. గృహంలో స్వల్పమార్పులు, మరమ్మతులు చేపడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది.