గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: మంగళవారం, 19 జులై 2022 (14:44 IST)

విడుద‌ల‌కు సిద్ధ‌మైన హన్సిక- శింబు మిస్టరీ థ్రిల్లర్ చిత్రం మహ

Hansika Motwani, Simbu
Hansika Motwani, Simbu
ప్రిన్సెస్ హన్సిక మోత్వాని టైటిల్ రోల్‌లో స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై నిర్మిస్తున్న చిత్రం `మ‌హా`. యుఆర్‌ జమీల్‌ దర్శకత్వంలో మదియళగన్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
 
యాక్షన్, సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన 'మహ' హన్సిక 50వ చిత్రం కావడం విశేషం. స్టార్ హీరో శింబు కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. మహ టీజర్, ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.
 
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జె లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ అందించగా జాన్ అబ్రహం ఎడిటర్ గా పని చేస్తున్నారు.  
 
తారాగణం: హన్సిక మోత్వాని , శింబు, శ్రీకాంత్ , కరుణాకరన్, తంబి రామయ్య తదితరులు
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: యు.ఆర్. జమీల్, నిర్మాత: మదియళగన్‌,  సంగీతం: జిబ్రాన్
డీవోపీ: లక్ష్మణ్, ఎడిటర్: జాన్ అబ్రహం,  పీఆర్వో : తేజస్వి సజ్జ