ఆదివారం, 26 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 3 డిశెంబరు 2022 (16:50 IST)

హిందూ పురుషులపై అజ్మల్ కామెంట్లు.. ఎలా పుడతారు.?

marriage
అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్ధుద్దీ అజ్మల్ హిందువులపై మరోసారి విరుచుకుపడి వార్తల్లోనిలిచారు. హిందువులైన పురుషులు.. వివాహేతర సంబంధాల కారణంగానే ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అజ్మల్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. హిందువులు 40 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటారని తెలిపారు.  
 
హిందువులు 40 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకున్నాక.. ఎలా పిల్లలు పుడతారని ప్రశ్నించారు. ముస్లింలు ఎలా వివాహం చేసుకుంటారో అదే ఫార్ములాను హిందువులు కూడా అనుసరించాలని అజ్మల్ సూచించారు. ముస్లిం పురుషులు 21 ఏళ్ల వయసు నిండిన వెంటనే వివాహం చేసుకుంటారని గుర్తు చేశారు.