సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (08:39 IST)

ముద్దు పెట్టిన వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు.. ఎక్కడ?

marriage
పూలమాల వేస్తూ వరుడు ముద్దు పెట్టడటంతో వధువు మొండిపట్టుతో పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద బదాయిలోని బల్సీకి చెందిన యువకుడికి, బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 26వ తేదీన వివాహం జరిగింది. 29వ తేదీన వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వధువు గ్రామానికి చేరుకున్నాడు. 
 
పెళ్లి ఆచారంలో భాగంగా, వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో ఆమెను వరుడు ముద్దు పెట్టుకున్నాడు. అయితే, అందరి ముందు తనను ముద్దు పెటుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన వధువు.. కోపంతో ఈ పెళ్ళి తనకు వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ ముద్దు వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరకు గ్రామ పంచాయతీ, పోలీసుల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ మనస్సు మార్చుకోని వధువు పెళ్లిని రద్దు చేసుకుుంది.