బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:04 IST)

Viral Video.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన వధువు..

Bride
Bride
కేరళకు చెందిన యువతి అందంగా పెళ్లికూతురుగా ముస్తాబైంది. కారులో కాకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఫోటో షూట్ చేయించుకుంది. కానీ, రోడ్డుపై ఉన్న వారంతా ఆమెను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అయితే, సదరు యువతి ఫొటో షూట్‌.. రోడ్డుపై ఉన్న గుంతలను చూపిస్తూ తీసుకుంది. వాహనదారుల ఇబ్బందులను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వధువును ప్రశంసిస్తున్నారు.
 
ఈ వీడియోలో, పూర్తిగా బురద నీటితో నిండిన పెద్ద గుంతకు పక్కన వధువు నడుస్తూ వెళ్తోంది. పడిపోకుండా నడుస్తూ.. చీరను పట్టుకుంటూ నడుస్తూ.. వాహనాలను దాటుతూ వధువు నడుచుకుంటూ వెళ్లింది. ఒక ఫోటోగ్రాఫర్ దూరం నుండి వధువును చిత్రాలను తీయడం కనిపిస్తుంది.