మీనాక్షి గ్లామర్‌తో వైలెన్స్‌ను బ్యాలెన్స్ చేసింది... హీరో నాని
నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం "హిట్-2". అడివి శేష్ హీరో. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. కోమలీ ప్రసాద్, మీనాక్షి హీరోయిన్లు. ఈ చిత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను బ్లాక్ బస్టర్ పేరుతో తాజా జరుపుకున్నారు.
ఇందులో హీరో నాని మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కోసం పని చేసి ప్రతి ఒక్కరికీ.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను అని అన్నారు. ఈ సినిమాలో కోమలీ ప్రసాద్ చాలా గొప్పగా నటించింది. డిఫరెంట్ రోల్స్‌తో తాను బిజీ అవుతుందని నమ్ముతున్నారు. ఇక మీనాక్షి తన అందచందాలతో ఈ సినిమాలోని వైలెన్స్‌ను బ్యాలెన్స్ చేసింది. కెమెరామెన్, ఎడిటర్‌లు తమతమ రంగాల్లో తమకి గల పట్టును మరోమారు నిరూపించారు.
ఇకపోతే, అడివి శేష్ గురించి మాట్లాడుతూ, చిన్నపుడు నాకంటే బాగా చదివే కుర్రాణ్ణి చూసి నేను టెన్షన్ పడేవాడిని. అలా ఇపుడు అడివి శేష్ చూసి టెన్షన్ పడుతున్నాను. ఏ విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా పెర్ఫెక్ట్‌గా ఉండటానికి అడివి శేష్ ప్రయత్నిస్తాడు. మేజిక్‌ను కాకుండా కష్టాన్ని నమ్ముకోవడం వల్లే హిట్స్ కొడుతున్నాడు అని హీరో నాని కితాబిచ్చాడు.