శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'హిట్-3'లో వర్ష ఉండాలని కోరుకుంటున్నాను : కోమలీ ప్రసాద్

komali prasad
అడివి శేష్ - శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "హిట్-2". నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. అడివి శేష్‌కు కోమలి ప్రసాద్‌ సహాయకురాలిగా నటించారు. ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఈ చిత్ర బృందం సక్సెస్ వేడుకలను జరుపుకున్నారు. 
 
ఇందులో కోమలి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ సినిమాకు థియేటర్స్‌లో వస్తున్న స్పందన చూశాను. ఇలాంటి ఒక సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జోనర్ ఫిలిమ్స్ అడివి శేష్ ఎక్కువగా చేసి ఉండటం వలవ్ల ఆయన నాకు ఎంతగానే సపోర్ట్ చేశారు. 
 
అందువల్లే వర్ష పాత్రను అంత బాగా చేయగలిగాను. "హిట్ 3"లో కూడా వర్ష ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటానని హీరో, నిర్మాత నాని చెబితే బాగుంటుంది అని అన్నారు. కాగా, ఈ చిత్రంలో కోమలి ప్రసాద్ పాత్ర పేరు వర్ష. ఈ పాత్రకు మంచి మార్కులే వచ్చాయి.