బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (09:31 IST)

ఇంటర్నెట్‌లో గుండెపోటు ట్రెండ్ అవుతోంది! షాక్‌లో భారత్! - కారణం ఏంటి?

Heart
ఇంటర్నెట్‌లో గుండెపోటు ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం హఠాత్తుగా గుండెపోటు రావడంతో హార్ట్ ఎటాక్ హ్యాష్ ట్యాగ్ ఇండియా మొత్తం ట్రెండ్ అవుతోంది. గుండెపోటు చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. గతంలో 40 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు ఎక్కువగా వచ్చేదని, ఇప్పుడు 25 ఏళ్ల వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.
 
తాజాగా ఓ యువతి పెళ్లి రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో స్పృహతప్పి వెంటనే మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆకస్మిక గుండెపోటుతో మరణించే యువకుల సంఖ్య ఇటీవల పెరుగుతుండటంతో, #heartattack అనే హ్యాష్‌ట్యాగ్ భారతదేశం అంతటా ట్రెండ్‌గా మారింది.
 
అదే సమయంలో, చాలా మంది వైద్యులు ఇటువంటి ఆకస్మిక గుండెపోటులను నివారించడానికి అవగాహన, పద్ధతులను కూడా పోస్ట్ చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఇటువంటి ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని వైద్యుల