అత్యంత చెత్త ఫ్లైట్ జర్నీ : ఇండిగో సంస్థను టార్గెట్ చేసిన రానా దగ్గుబాటి
హీరో దగ్గుబాటి రానాను ఇండిగో విమానయానాల్లో చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ సంస్థ పనితీరును తన ట్విట్టర్ ఖాతాలో ఏకిపారేశారు. ఇండిగో విమానానాలు ఎపుడు వస్తాయో, వెళతాయో ఇండియా విమాన సంస్థ అధికారులకే కాదు సిబ్బందికి కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు. ఇండిగో సంస్థను రానా ఇలా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం లేకపోలేదు.
ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ వెళ్లిన తర్వాత వారు బుక్ చేసుకున్న విమానం రద్దు అయింది. దీంతో మరో విమానంలో వెళ్లాలని సూచించారు. లగేజీ కూడా అదే విమానంలో వస్తుందని సిబ్బంది చెప్పారు. దీంతో సమ్మతించి రానా ప్రత్యామ్నాయ విమానంలో బెంగుళూరుకు వెళ్ళారు.
బెంగుళూరు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత రానాకు చెందిన లగేజీ మాత్రం మిస్ అయింది. దాంతో రానా అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విమానాశ్రయ సిబ్బంది కూడా సరైన వివరణ ఇవ్వలేక పోయారు. దీంతో ఉన్నతాధికారులను కూడా ప్రశ్నించగా, వారి నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ట్విట్టర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.
విమానాలు ఎపుడొస్తాయో, ఎపుడు వెళతాయో తెలియదు. మిస్సయిన లగేజీ ఎలా కోనుగొనాలో తెలియదు. ఈ విషయాలు సిబ్బందికే తెలియదు అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు ఇండియో ఎయిర్‌లైన్స్ ప్రచార పోస్టులపైనా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. దీంతో రానా ట్వీట్‌కు నెటిజన్లు కూడా మద్దతు పలుకుతూ ఆ విమానాల్లో తమకు ఎదురైన అనుభవాలను కూడా వారు షేర్ చేశారు.