శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'సాహో' దర్శకుడితో పవర్ స్టార్ కొత్త చిత్రం..

dvv - pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలు చేసేందుకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్న ఆయన తాజాగా మరో చిత్రానికి సమ్మతం తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి 'సాహో' మూవీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ కొత్త పోస్టర్‌ను ఆదివారం రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్‌ను ఒక ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటారని ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్‌లో పవన్ వెనుకవైపు నిలబడివున్నట్టు కనిపిస్తున్నారు. ఈ సినిమాకు రవి కె చంద్రన్ కెమెరామెన్‌గా పని చేస్తుంటే, సుజీత్ కథను సమకూర్చి దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ యేడాది "ఆర్ఆర్ఆర్" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఇపుడు పవన్‌తో నిర్మించే చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుండగా, ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.