శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (12:43 IST)

'కాంతార'కు కోర్టులో క్లియరెన్స్.. ఓటీటీలో 'వరాహ రూపం' పాట

kantara
సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం "కాంతార". రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన హీరోగా నటించారు. సప్తమీ గౌడ హీరోయిన్. ప్రముఖ నిర్మాణం సంస్థ హోంబలే నిర్మించింది. సెప్టెంబరు నెలాఖరులో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుంది. కేవలం 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం అన్ని భాషల్లో కలుపుకుని పాన్ ఇండియా మూవీగా రూ.400 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. 
 
ఇటీవలే ఓటీటీలో కూడా విడుదలైంది. అయితే 'కాంతార'లో ఎంతో హిట్టయిన వరాహరూపం సాంగ్ ఒరిజినల్ వెర్షన్ ఓటీటీలో కనిపించకపోవడంతో వీక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ పాట కాపీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ కోర్టు ఆంక్షలు విధించింది. దీంతో ఆ పాట లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. 
 
తాజాగా కాంతారకు కోర్టులో క్లియరెన్స్ వచ్చింది. ఈ పాటపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను తాజాగా ఎత్తివేసింది. దీనిపై దర్శకహీరో రిషబ్ శెట్టి స్పందించారు. ప్రజల ప్రేమాభిమానాల ఫలితంగా కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. త్వరలోనే కాంతార ఓటీటీ వెర్షన్‌కు "వరాహరూపం" ఒరిజినల్ సాంగ్ జత చేస్తామని వెల్లడించారు.