బుధవారం, 29 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 26 నవంబరు 2022 (11:58 IST)

వరాహరూపం ఈజ్ బ్యాక్.. అదే పాటతో వచ్చేస్తోన్న కాంతార

Kanthara
నవంబర్ 24 నుంచి కాంతార సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే వరాహరూపం మ్యూజిక్‌ను ఓటీటీలో తీసేసి రిలీజ్ చేశారు. దీనిపై ప్రేక్షకుల తీవ్ర అసంతృప్తి చెందారు. 
 
వరాహరూపం పాటకు వాడిన మ్యూజిక్ తమదని ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టులో కేసు వేయడంతో ఆ మ్యూజిక్‌ని వాడొద్దంటూ కోర్టు అప్పటికి నిషేధం విధించి విచారణని వాయిదా వేసింది. దీంతో ఆ మ్యూజిక్ తీసేసి సినిమాని రిలీజ్ చేశారు. 
 
అయితే తాజాగా కాంతారాకు సపోర్ట్ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆ మ్యూజిక్‌పై నిషేధం ఎత్తివేయడంతో త్వరలో ఆ మ్యూజిక్‌తో ఓటీటీలో రానుంది కాంతార. దీనిపై సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.