సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (13:04 IST)

హక్కుల రక్షణ కోసం కోర్టుకెక్కిన బాలీవుడ్ సూపర్ స్టార్

amitabh
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కోర్టుకెక్కారు. తన హక్కులను కాపాడాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేబీసీ పేరుతో నకిలీ లాటరీ స్కామ్‌లు నిర్వహిస్తూ పేరును, ఫోటోలను తన అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు అమితాబ్ బచ్చన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
తన పేరును, స్వరాన్ని, ఫోటోలను తన అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకిలీ లాటరీ స్కామ్, మరే ఇతర సంస్థ, వ్యక్తులు వాడుకోకుండా నిరోధించాలని, తన ప్రచార హక్కులను కాపాడాలని అమితాబ్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్ నవీన్ చావ్లా అమితాబ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. 
 
అమితాబ్ అనుమతి లేదా ధృవీకరణ లేకుండా ఆయనకున్న సెలబ్రిటీ హోదాను వినియోగించుకోవడాన్ని జస్టిస్ చావ్లా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో అమితాబ్ పేర్కొన్నట్టుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేశారు.