ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (17:31 IST)

హీరోలు పుట్టరు, ఎదుగుతారు.. ప్ర‌భాస్ గురించి ప్రాజెక్ట్ కె పోస్ట‌ర్‌లో వెల్ల‌డి

Project K poster
Project K poster
రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె' కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తొలిసారి కలిసి 'ప్రాజెక్ట్ కె' మాస్టర్ పీస్ ని రూపొందిస్తున్నారు.  
 
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'ప్రాజెక్ట్ కె'  కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్‌ చేయి ఓ కవచంతో గాలిలోకి దూసుకెళుతున్నట్లు కనిపిస్తోంది. పోస్టర్ పై Heroes are not born, They RISE ( ‘హీరోలు పుట్టరు, ఎదుగుతారు’) అనే మాటలు ప్రభాస్ హీరోయిక్ పాత్రని తెలియజేస్తున్నాయి.
 
ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తుండగా, ప్రభాస్ సరసన దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది.
 
విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అశ్విని దత్ నిర్మాత.