సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (10:21 IST)

అమితాబ్ కాలిని చీల్చిన ఇనుపముక్క : గాయానికి కుట్లు

Amitab
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ఆయన కాలికి గాయమైంది. ఇనుప ముక్క కాలిని చీల్చింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన్ను తక్షణ ఆస్పత్రికి తరలించగా, గాయానికి వైద్యులు కుట్లు వేశారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. 
 
తనకు పెద్ద గాయమైందని ఆయన వెల్లడించారు. ఒక ఇనుప ముక్క తన కాలిని చీల్చడంతో తీవ్రంగా రక్తస్రావమైందని, వెంటనే తనను ఆస్పత్రికి తరలించారని చెప్పారు. 
 
ఈ రక్తస్రావాన్ని ఆపేందుకు వైద్యులు కుట్లు వేశారని చెప్పారు. ఈ మేరకు ఆయన తన బ్లాగులో రాసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు నడవకుండా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తనకు సూచించినప్పటికీ తాను కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగులో పాల్గొంటున్నట్టు చెప్పారు. 
 
బ్యాండేజ్‌తోనే కౌన్ బనేగా కరోడ్ పతి సెట్లో అటు, ఇటు పరుగుపెడుతున్న ఫోటోలను ఆయన షేర్ చేశారు. మరోవైపు, వచ్చే యేడాది అమితాబ్ బచ్చన్ 80వ యేటలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన 79 యేళ్ల వయస్సులోనూ ఎంతో చలాకీగా ఉన్నారు.