శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (09:19 IST)

బాక్సాఫీస్ వద్ద కాంతార పరుగులు - రూ.400 కోట్ల వసూళ్లు

kantara
కన్నడ చిత్రం 'కాంతార' బాక్సాఫీస్ వద్ద పరుగులు తీస్తుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు రూ.400 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 
 
సెప్టెంబరు 30వ తేదీన కన్నడంలో తొలుత విడుదలైన 'కాంతార' అక్కడ సంచలన విషయం నమోదు చేసుకుంది. దీంతో ఇతర భాషల్లో కూడా ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే, ఈ చిత్రం విడుదలై నెల రోజులు గడిచిపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతూనే వుంది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. రూ.16 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టడం సినీ పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. 
 
ఈ చిత్రం ఒక్క కన్నడ భాషలోనే రూ.168.50 కోట్లు, తెలంగాణ, ఆంధ్రలో రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో రూ.19020 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.44.50 కోట్లు, ఉత్తర భారతంలో రూ.96 కోట్లు చొప్పున మొత్తం 400.90 కోట్ల వసూళ్లను రాబట్టింది.