1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (11:05 IST)

విమానంలో ప్రయాణికుడి వికృత చేష్టలు... దించేసి వెళ్లిన సిబ్బంది

spicejet
ఇటీవలి కాలంలో విమానాల్లో పలు రకాలైన అనుచిత ఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి రావాల్సిన ఒక విమానంలో ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తన చేష్టలతో విమాన సిబ్బందిని వేధించాడు. దీంతో విమాన సిబ్బంది ఆ ప్రయాణికుడిని విమానం నుంచి దించేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. 
 
ఈ విషయాన్ని స్పైస్ జెట్ విమాన సంస్థ తెలిపింది. వికృత చేష్టలకు పాల్పడిన ప్రయాణికుడితో పాటు అతనితోపాటు ఉన్న మరో ప్రయాణికుడిని కూడా దించేసినట్టు తెలిపింది. ఆ తర్వాత వారిని ఢిల్లీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విమానాల్లో అనుచిత ఘటనలు జరిగినపుడు తమకు తెలియజేయాలని డీజీసీఏ ఆదేశించిన నేపథ్యంలో స్పైస్ జెట్ సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.