శనివారం, 23 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (08:59 IST)

మూవింగ్ కారులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం

victim
పాటియాలాలో ఓ దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమ గ్రామంలో పెళ్లి ఊరేగింపు వేడుకను చూస్తున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులోనే ఆ బాలికను చెరబట్టి అత్యాచారం చేశారు. ఈ దారుణం పాటియాలాకు సమీపంలోని బల్బేడా గ్రామంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పెళ్లి వేడుకల్లో భాగంగా, జాగో సంప్రదాయ ఊరేగింపును తిలకిస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బలంవంతంగా కారులు ఎక్కించుకుని, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై ఐపీసీ, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 
 
ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులిద్దరూ అదే గ్రామానికి చెందిన 30 యేళ్ళ వ్యక్తులు. వీరిద్దరికీ వివాహమై భార్యలు ఉన్నారు. వీరిని పాటియాలా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం పాటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్‌కు తరలించారు.