బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: శనివారం, 30 ఏప్రియల్ 2022 (12:03 IST)

పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ - ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

mobile phone
పంజాబ్ రాష్ట్రంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ రాష్ట్రంలోని పాటియాలాలో ఉన్న కాళీ మందిర్ ప్రాంతంలో శివసేన నేతలు, ఖలిస్థాన్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పైగా, ఖలిస్థాన్ మద్దతుదారులు, శివసేన కార్యకర్తలను పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించాయి. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. 
 
ఇరువర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కత్తులతో వీరంగం సృష్టించారు. రాళ్లదాడి చేసుకోవడం కలకలం రేపాయి. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పటియాలకు అదనపు బలగాలను రప్పించారు. 
 
మరోవైపు, ఉద్రిక్త ప‌రిస్థితులు చ‌ల్లార‌క‌పోవ‌డం, వదంతులు వ్యాపిస్తుండ‌డంతో సీఎం భగవంత్‌ మాన్ కీల‌క‌ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందార‌ని, హింసను నియంత్రించడంలో విఫలమయ్యార‌ని ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై భగవంత్‌ మాన్‌ సర్కార్ చ‌ర్య‌లు తీసుకుంది. పటియాలా రేంజ్ ఐజీతో పాటు ఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీలను ఆ పదవి నుండి బదిలీ చేశారు. 
 
అదేసమయంలో పోలీసులు ప‌టియాలాలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ప‌రిస్థితులు ఇప్ప‌టికీ అలాగే ఉండ‌డంతో ఆదివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు పంజాబ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.