సంబంధిత వార్తలు
- పూనమ్ కౌర్ ఫోటో పైన అలాంటి టెక్ట్స్ వాడితే ఖబడ్దార్: యూ ట్యూబర్లకు హెచ్చరిక
- రష్యా మెడపై ఆంక్షల కత్తి : రష్యన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం
- లాడ్జిలో యూట్యూబ్ చూసి లింగమార్పిడి.. వ్యక్తి మృతి
- తిట్లు, నిందలు, అసత్యాలు, నిరాధారమైన కుట్రలు: బాలీవుడ్‌ను వ్యతిరేకిస్తూ యూట్యూబ్‌లో వ్యూస్ పెంచుకుంటున్న వ్యక్తులు
- వివాదంపై సింగర్ సునీత భర్త స్పందన: అప్పుడే ఆ పని చేశాం..
రష్యాకు షాక్: యూట్యూబ్, గూగుల్ ప్లే సేవలు బంద్
అగ్రరాజ్యం అమెరికా సహా నాటో, ఈయూ దేశాలు సహా పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి యూట్యూబ్, గూగుల్ ప్లేలు కూడా చేరిపోయాయి.
ఈ రెండు సంస్థలకు చెందిన అన్నిచెల్లింపుల సేవలను రష్యాలో నిలిపివేస్తున్నట్లుగా ఈ సంస్థల మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గురువారం ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది.
వాస్తవానికి ఇదివరకే యూట్యూబ్‌తో పాటు గూగుల్ కూడా రష్యా వాణిజ్య ప్రకటనలను తమ వేదికపై నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా చెల్లింపులతో కూడిన తన సేవలన్నింటినీ కూడా రష్యాలో నిలిపివేస్తున్నట్లుగా యూట్యూబ్, గూగుల్ ప్లే తెలిపాయి.
ఈ నిర్ణయంతో రష్యాకు చెందిన వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియమ్, ఛానెల్ మెంబర్ షిప్, సూపర్ ఛాట్, మర్కెండైజ్ సేవలు అందవు.
