శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (17:53 IST)

జాతీయ పార్టీ హోదాను కోల్పోనున్న కాంగ్రెస్ పార్టీ?

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఘోర పరాభవనాన్ని చవిచూసింది. పార్టీ అంతర్గత కుమ్ములాటలు కారణంగా పంజాబ్‌లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఐదు రాష్ట్రాల ఓటమితో ఆ పార్టీ జాతీయ హోదాకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, శతాబ్ద కాలానికి పైగా ఘన చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమిపాలుకావడం సాధారణ అంశంగా మారింది. 
 
2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఇపుడు కేవలం రెండు రాష్ట్రాలకో పరిమితం కానుంది. కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉండనుంది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.